చిక్ బల్లాపూర్ లో ఈ వారం

చిక్ బల్లాపూర్  లో ఈ వారం ,
 మొన్న శనివారం అనగా మూడో తారీకు పొద్దునే బెంగుళూరు నుండి వచ్చామిక్కడికి
ఒక వారం దీపావళి సందర్బంగా ఇక్కడ విల్లా లో గడపడానికి.
ఈ విశాలమై  శ్వేత ప్రశాంత  కట్టడం,ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.


అన్విక ఆటలకు అనువైన సౌధం .
చుట్టూ బోలెడన్ని పూల మొక్కలు ,ఇంటిముందట ఒక చిన్న నీటి చిచ్చు బుడ్డి ,పక్కనే
నాకెంతో నచ్చే "సింగపూర్ చెర్రీ " గా పిలవ బడే "కొక కోలా " చెర్రీ (ఇది నా nomenclature )
గొడుగు లాంటి ఎర్రని తీపి పళ్ళ పర్ణశాల మొక్క .




ఈ పర్ణశాల  మొక్క వెనకాలే  మా అన్విక  కోసం ,తనకి ఎంతో ప్రీతి పాత్రమయిన 
"ఉయ్యాలయినా ,జంపాలైనా " 
మరియు  
1 ,2 , 3 జుయ్ జుయ్  "జారుడు  బండ "






సరే , ఇక మా అందరికీ కూడా సరదా గా తిరగడానికి పెద్ద విశాలమైన తోట . ఒకటే ఇక్కడ ఇబ్బంది కోతులు ,ఒక దండు హఠాత్తుగా దూకుతుంది ఏ మూలనుండో ,దండు రాగానే మేము తోక ముడిచి ఇంట్లోకి,తప్పదుగా చిన్న పిల్ల మా వెంట ఉందిగా . 


సరే దీపావళి మందు రోజు హాయిగా కొన్ని పువ్వు వొత్తులు,భూ చక్రం అన్విక కి చూపించాము 
పాపం దానికి పెద్ద పెద్ద శబ్దాలు ,అల్లరి అంతగా నచ్చలేదు 
 నిన్న అంటే 10 వ తారీకు న సాయంత్రం ఒక  పురాతన గుడి కి వెళ్లి వచ్చాము 
తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఆలయం ,అన్నారు 


సాయంత్రం దీపాల వెలుగులో శ్వేత సౌధం ,White House  కాదు ,

ఇక కర్నాటక ప్రత్యేక వంటకం ," రాగి ముద్ద" మొదలు     పెట్టాను 

ఒక తిరుపతి లడ్డు అంత ముద్ద, పళ్లెం లో పెట్టుకుని ,పక్కన చిక్కటి సాంబారు పెట్టుకుని ,
వేళ్ళు సాంబారులో ముంచి ,తిరుపతి లడ్డు ని ఒక పక్క గిల్లి ,సాంబారు లో ముంచుకు తినాలి .
మెత్తగా, నమల  కుండా నే మింగేయ వచ్చు , ఒక లడ్డు తింటే సరి ,పక్కన కావాలంటే ఒక కాయ కూర ఉంచుకుని ఆరగించి వచ్చు 
ఆరోగ్యానికి చాలా మంచి దట ,
అరుగుదల కూడా బానే ఉంది.


=====================================================================================



Comments

Popular posts from this blog

అన్విక, బోసినవ్వుల కలబోసి , కబన్ పార్క్ విహారం

విమాన యాత్ర ,రెండు అంగల్లో ఒమాన్ మీదుగా మిలాన్