అన్విక, బోసినవ్వుల కలబోసి , కబన్ పార్క్ విహారం
నిన్న 29 ఉదయం అల్పాహారం చేసి, ఉద్యానవన బెంగళూరు, మేఘావృతమై చిరుజల్లులు వెదజల్లే వేళ ,అన్విక ఆటలు ,అరుపులు పెడుతుంటే ,కబన్ పార్క్ వెళ్లి కాసేపు ప్రాణవాయువులు పీలుద్దామని ,మా ఈషా కోరగానే అందరం కారెక్కాము . ఉదయం బెంగళూరు మెజెస్టిక్ సర్కిల్ ప్రాంతం మొత్తం ఒక పర్ణశాల పోలి ఉంటుంది నాకు ,నిన్నే మొదటి సారి అనిపించింది ,విదేశాలకి వెళ్లాలంటే వీసా లు హాలిడే ప్యాకేజీలు ఇవ్వన్నీ బోలెడు ప్రయాసలు పడాలి ,అవన్నీ లేకుండా ,వానాకాలం బెంగళూరు లో వారం గడిపితే చాలు యూరోప్ వెళ్ళినట్లే .. పెద్ద పెద్ద శిరీష వృక్షాలు వీధులన్నిటినిమీదా పడగలా కప్పేసి ,వీధుల కిరు వైపులా చక్కటి ,పాదచారులు క్షేమంగా నడవడానికి వేసిన "నడవ " లకి నీడ నిస్తూంటే ,ఆ వీధుల్లో నడవడమే ఆనందం ,అనిపించని వాడికి ,మన పాదచారులకు నడిచే ,వీలే లేకుండా చేసిన భాగ్యనగరమే,శరణ్యం! దారిలో ఒక "నడవ " నానుకు ఉన్న Keventers ,అనే చిలకిన పాల పానీయం(MILKSHAKE) వద్ద ఆగి , (Cunningham Road లో) అక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఒక పెద్ద పొడుగాటి మన పూర్వం డైరీ ఫారం పాల సరఫరా, పోలిన గాజు సీసా లో కమ్మటి చ...