Posts

చిక్ బల్లాపూర్ లో ఈ వారం

Image
చిక్ బల్లాపూర్  లో ఈ వారం ,  మొన్న శనివారం అనగా మూడో తారీకు పొద్దునే బెంగుళూరు నుండి వచ్చామిక్కడికి ఒక వారం దీపావళి సందర్బంగా ఇక్కడ విల్లా లో గడపడానికి. ఈ విశాలమై  శ్వేత ప్రశాంత  కట్టడం,ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్విక ఆటలకు అనువైన సౌధం . చుట్టూ బోలెడన్ని పూల మొక్కలు ,ఇంటిముందట ఒక చిన్న నీటి చిచ్చు బుడ్డి ,పక్కనే నాకెంతో నచ్చే "సింగపూర్ చెర్రీ " గా పిలవ బడే "కొక కోలా " చెర్రీ (ఇది నా nomenclature ) గొడుగు లాంటి ఎర్రని తీపి పళ్ళ పర్ణశాల మొక్క . ఈ పర్ణశాల  మొక్క వెనకాలే  మా అన్విక  కోసం ,తనకి ఎంతో ప్రీతి పాత్రమయిన  "ఉయ్యాలయినా ,జంపాలైనా "  మరియు   1 ,2 , 3 జుయ్ జుయ్  "జారుడు  బండ " సరే , ఇక మా అందరికీ కూడా సరదా గా తిరగడానికి పెద్ద విశాలమైన తోట . ఒకటే ఇక్కడ ఇబ్బంది కోతులు ,ఒక దండు హఠాత్తుగా దూకుతుంది ఏ మూలనుండో ,దండు రాగానే మేము తోక ముడిచి ఇంట్లోకి,తప్పదుగా చిన్న పిల్ల మా వెంట ఉందిగా .  సరే దీపావళి మందు రోజు హాయిగా కొన్ని పువ్వు వొత్తులు,భూ చక్రం అన్విక కి చూపించాము...

అన్విక, బోసినవ్వుల కలబోసి , కబన్ పార్క్ విహారం

Image
నిన్న 29 ఉదయం అల్పాహారం చేసి, ఉద్యానవన బెంగళూరు, మేఘావృతమై చిరుజల్లులు వెదజల్లే వేళ ,అన్విక ఆటలు ,అరుపులు పెడుతుంటే ,కబన్ పార్క్ వెళ్లి కాసేపు ప్రాణవాయువులు పీలుద్దామని ,మా ఈషా కోరగానే అందరం కారెక్కాము . ఉదయం బెంగళూరు మెజెస్టిక్ సర్కిల్ ప్రాంతం మొత్తం ఒక పర్ణశాల పోలి ఉంటుంది  నాకు ,నిన్నే మొదటి సారి అనిపించింది ,విదేశాలకి వెళ్లాలంటే వీసా లు హాలిడే ప్యాకేజీలు ఇవ్వన్నీ బోలెడు ప్రయాసలు పడాలి ,అవన్నీ లేకుండా ,వానాకాలం బెంగళూరు లో వారం గడిపితే చాలు యూరోప్ వెళ్ళినట్లే ..   పెద్ద  పెద్ద శిరీష వృక్షాలు వీధులన్నిటినిమీదా పడగలా కప్పేసి ,వీధుల కిరు వైపులా చక్కటి ,పాదచారులు క్షేమంగా నడవడానికి వేసిన "నడవ " లకి నీడ నిస్తూంటే ,ఆ వీధుల్లో నడవడమే ఆనందం ,అనిపించని వాడికి ,మన పాదచారులకు  నడిచే ,వీలే లేకుండా చేసిన భాగ్యనగరమే,శరణ్యం! దారిలో ఒక "నడవ " నానుకు ఉన్న Keventers ,అనే  చిలకిన పాల పానీయం(MILKSHAKE) వద్ద ఆగి , (Cunningham Road లో) అక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఒక పెద్ద పొడుగాటి మన పూర్వం డైరీ ఫారం పాల సరఫరా, పోలిన గాజు సీసా లో కమ్మటి  చ...

రోమా ( రోమ్ ని ఇలానే అంటారు ఇటాలియన్లు ) లో మొదటి రోజు విహారం - Part 1

Image
ఇదిగో! మా ఇటలీ  గూటి ముఖచిత్రం  ఇవ్వాళ మూడవ రోజు , నిన్న ద్వితీయ విఘ్నం కాలేదుగా ,ఇంక ధోకా లేదు ,కొనసాగుతుంది " బ్లాగు ", భారతీయ క్రికెట్ జట్టు సారధి ధోనీ ,ఉన్నంత వరకూ ,మన ఇన్నింగ్స్ కి భరోసా ఉన్నట్లు ...  (ఒక స్మైలీ ముద్రిద్దామంటే కుదరలేదు ) సరే కథలోకి , మా హిందీ మాత్రమే తెలిసిన అవధూత్ సహా,మేమందరం  డ్రైవర్ ని ....వేయి కళ్ళతో ,దుర్భిణీ వేసినంత పనీ చేసి ఆఖరున , పట్టుకుని , ఆ రాత్రి బస చేసే "ఐబిస్ " హోటల్ చేరుకున్నాము . ముందే వార్నింగ్ ఇచ్చినట్లుగా ,సామాను ఎవరిది వారే మోయాలి,లాగాలి ,భుజానికో, మెడకో  ( గొంతుకు ఉరి వేసినట్లు కాకుండా ,జాగ్రత్తగా ) తగిలించుకు మనకి , నిర్దేశించబడిన గూటికి ( గూడు ) చేరాలి .  ఇదేమంత సులభం కాదు . ఒక్కోసారి ఒకే గ్రూప్ లో వారికి తలా ఒక అంతస్తు లో  నూ రావొచ్చు .  సరే మొత్తానికి  అవధూత్ జీ ,ఎవరి తాళాలు వారికిచ్చిన వెంటనే ,సామానూ మనుషులూ దొర్లుకుంటూ(దొర్లించుకుంటూ? నా )  గూడుకి చేరాము .. సుమారు 20 గంటలు తరువాత , వివిధ వాహనాల సాయంతో ,  ఇటలీ లో చక్కటి వెచ్చటి గూడు కి చేరాము.  ...

విమాన యాత్ర ,రెండు అంగల్లో ఒమాన్ మీదుగా మిలాన్

Image
ఒమాన్ ఎయిర్ లైన్స్ స్వాగతం పలుకగా మూడూ ,నాలుగు గంటల విహారం . ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్థాన్ తగలకుండా ,సముద్రం పైగా ఒమాన్ , మస్కట్ కేసి పరుగు, విమానం. సీటుకు అతుక్కుని ,ఎదురుగా అరేబియన్ సినిమాలు , హిందీ మరియు ఇంగ్లీష్ ,కొన్ని తెలుగు అన్నీ వెదుకుతూ, అక్కడ వాళ్ళిచ్చిన పానీయాలూ ,ఆకలి తెలియకుండా ఉండటానికి పెట్టిన పదార్ధాలూ ,జాగ్రత్తగా (మీదపోసుకోకుండా ,శరీరానికి హానిజరగనంత వరకూ ,మితంగా ) పుచ్చుకుని , మస్కట్  ఎయిర్పోర్ట్ లో దిగి ,వెంటనే ఆలశ్యం చేయకుండా మిలాన్ ఫ్లైట్ వెతుక్కుంటూ పరుగు . త్వరలోనే అక్కడ పెద్దగా నిరీక్షణ లేకుండా మిలాన్ ఫ్లైట్ ఎక్కాము . ఒమాన్ ఎయిర్లైన్స్ స్వాగతం మరోసారి! ఈ సారి ,సుమారు ఏడుగంటలు మా గంతు ,జంపు (Jump) మళ్ళీ అవే  సినిమాలు ,అవే పానీయాలు . విమానాల్లో ఆహారం సరిగ్గా ఉండదు ,మన మంచికే అని తరవాత తెలిసింది . ఎలా అంటే , మాతో పాటే  ప్రయాణీకుడు ఒకతను మస్కట్ లో ఎక్కాడు . ఇండియన్,మాంసాహారి . ఎక్కింది తినడానికే,తాగడానికే అన్నట్లు  (మూడు నాలుగు శాంపిల్ సీసాల మద్యం ,రెడ్ వైన్ )  నాన్- వెజ్ అడిగి మరీ తీసుకున్నాడు . వీడెక్కడి వాడురా మన...

ముందు మాట

Image
హైదరాబాద్  విమానాశ్రయంలో దోశ హబ్  తుమకూరు లో ప్రస్తుతం,మేము(నేనూ,మా ఆవిడా ) మా చిన్నబ్బాయి తో, కోడలి తో, మనవరాలి సంరక్షణలో నిమగ్నమై ఉన్నాము . ఇటీవలే యూరోపు ప్రయాణం చేసి వచ్చాక అక్కడి అనుభూతులన్నింటిని పంచుకుందామనుకుంటున్నా.మా గోపీ  అడుగుతూనే ఉన్నాడు రాయమని ,నాకే "Moment Of Inertia " మా యూరోప్ ప్రయాణానికి ప్రేరణ మా గోపీ, మా ఆవిడ తమ్ముడు . ఊరికే ,మాట మాత్రంగా "యూరపు వెళ్లాలనుకుంటున్నాము ,మీరూ రావచ్చు కదా "అని వారడగడం ,ఆమ్మో రాలేమని మా వాళ్ళు చెప్పడం జరిగి పోయాక ,నేను " అవును సరదాగా వెళ్లి రావొచ్చు ,ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ?"  "తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది " , It is a cart if it moves  or else it is Timber " " ప్రయాణం చేయడానికి  ధనవంతుడు కానక్కరలేదు ముందుకు అడుగు వేయడమే ముఖ్యం ", అంటూ నేనెక్కడో చదివిన వాక్యాలు ఉపయోగించడం ,ఆ మాట  పట్టుకుని , వెళ్ళేదాకా తీసుకురావడం ,అక్కా చెల్లెళ్ళ వంతయింది . ప్రయాణానికి సంసిద్ధత ప్రకటించడం ఒక ఎత్తు ,ఆపైన సన్నాహాలు మరొక ఎత్తు అయితే ,వీసా కోసం చేసే తిప్పలు ఇంకా పెద్ద ఎత్తు . వారినీ,వ...