విమాన యాత్ర ,రెండు అంగల్లో ఒమాన్ మీదుగా మిలాన్
ఒమాన్ ఎయిర్ లైన్స్ స్వాగతం పలుకగా మూడూ ,నాలుగు గంటల విహారం . ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్థాన్ తగలకుండా ,సముద్రం పైగా ఒమాన్ , మస్కట్ కేసి పరుగు, విమానం.
సీటుకు అతుక్కుని ,ఎదురుగా అరేబియన్ సినిమాలు , హిందీ మరియు ఇంగ్లీష్ ,కొన్ని తెలుగు
అన్నీ వెదుకుతూ, అక్కడ వాళ్ళిచ్చిన పానీయాలూ ,ఆకలి తెలియకుండా ఉండటానికి పెట్టిన పదార్ధాలూ ,జాగ్రత్తగా (మీదపోసుకోకుండా ,శరీరానికి హానిజరగనంత వరకూ ,మితంగా ) పుచ్చుకుని , మస్కట్ ఎయిర్పోర్ట్ లో దిగి ,వెంటనే ఆలశ్యం చేయకుండా మిలాన్ ఫ్లైట్ వెతుక్కుంటూ పరుగు .
త్వరలోనే అక్కడ పెద్దగా నిరీక్షణ లేకుండా మిలాన్ ఫ్లైట్ ఎక్కాము .
ఒమాన్ ఎయిర్లైన్స్ స్వాగతం మరోసారి!
ఈ సారి ,సుమారు ఏడుగంటలు మా గంతు ,జంపు (Jump)
మళ్ళీ అవే సినిమాలు ,అవే పానీయాలు .
విమానాల్లో ఆహారం సరిగ్గా ఉండదు ,మన మంచికే అని తరవాత తెలిసింది .
ఎలా అంటే ,
మాతో పాటే ప్రయాణీకుడు ఒకతను మస్కట్ లో ఎక్కాడు . ఇండియన్,మాంసాహారి .
ఎక్కింది తినడానికే,తాగడానికే అన్నట్లు (మూడు నాలుగు శాంపిల్ సీసాల మద్యం ,రెడ్ వైన్ ) నాన్- వెజ్ అడిగి మరీ తీసుకున్నాడు . వీడెక్కడి వాడురా మన భారతీయుల పరువు తీస్తున్నాడు ,అనుకుంటూ ఉన్నా .. చివరికి స్నాక్స్ పాకెట్స్ కూడా అరడజన్ అడిగి దగ్గర ఉంచుకున్నాడు .
అందులో కొన్ని ప్లాస్టిక్ కవర్లు కిందా ,పైనా అటూ ఇటూ చికాకుగా ,
ఆఖరికి మిలాన్ చేరే సమయానికి అతను ,సగం సగం తిని పారేసిన కవర్ల మధ్య నించి లేచాడు
ఇంతకీ విషయమేమిటంటే ,ఈతను ఒక తెలుగు వాడు ,మా గ్రూప్ లో కలిసే, మద్రాస్ ట్రూప్ లో కాంట్రాక్టర్ , అలా మితంగా తినకపోవడం వల్ల ,మిగతా పది రోజులూ ,మందకొడిగా భయం భయంగా గడిపాడు ... మిలాన్ లో దిగే సమయానికి కడుపు లో గడబిడ మొదలయింది . .. పాపం .. మనిషి మంచివాడే .. తరవాత తెలిసింది (అతని 13 రోజుల ప్రవర్తన వల్ల)
ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా ,మన కాలమానం ప్రకారం పగలేగా ,నిద్ర రాదు .
ఒక విమానం దిగి మరొక విమానం మేము ఎక్కామే గానీ ,మా సామాన్లు సరిగ్గా ఇందులోనే ఎక్కించారా లేదా అన్నది ఒక సందేహం ?
సరే ఏమయితే నేమి ,హ్యాండ్ లగేజ్ లో ఒకటో రెండో జతలున్నాయిగా ,అనే ధైర్యం
మిలాన్ లో మాకు ,వెంటనే ఎలాంటి ఇబ్బందీ లేకుండా గైడ్ కలుసుకుని క్షేమంగా హోటల్ చేరుస్తాడని నమ్మకం .
అంతా సస్పెన్సు .
మా గైడ్ స్విట్జర్లాండ్ నించి సమయానికి మిలాన్ కి , వచ్చి, మమ్మల్ని
కలుసుకుంటాడనీ ,అతనెవరో నార్త్ ఇండియన్ అనీ ,హిందీ మాట్లాడుతాడనీ ... అతడు కలిసేదాకా సస్పెన్స్ ... మా యాత్ర ఆధారం ఆయనే అనే నమ్మిక ..
విమాన ప్రయాణం లో మొదటి మూడు నాలుగు గంటలూ ఒక ఎత్తయితే ,మిగతా గంటలన్నీ గంట ,రెండు గంటలెత్తు 😆
మా పిల్లలు చెబుతూనే ఉన్నారు .. విదేశాల్లో ఇబ్బందులు ఎదురవుతే చాలా కష్టం ,గైడ్ కాంటాక్ట్ నెంబర్,హోటల్ బుకింగ్స్,హోటల్ ఫోన్ నంబర్స్, ఇవ్వన్నీ ముందుగానే ఉండాలని
మాకయితే ,ఒక నెంబర్ ఇచ్చారు, ట్రావెల్స్ సాయిరాం , గైడ్ పేరు అవధూత్ అని ,అతనెక్కడినించో వచ్చి మమ్మల్ని కలుస్తాడని .
సరే ,
మిలాన్ లో దిగడం ,గబా గబా, ఇటలీ లో అడుగు పెట్టామన్న ఆనందం
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ మాట్లాడే మనకు ఇటలీ మీద అభిమానం ,ఇటలీ,రోమ్,వాటికన్ ,రోమియో -జూలియట్ ,రోమ్ తగబడుతుంటే ..నీరో .. నియంత ... పియానో వాయించాడని ..
ఆ ఆనందం లో ,సామాన్లు వెతుక్కుని ,అన్ని సామాన్లు తెచుకున్నందుకు మరో సారి తిట్టుకుని ,
అవధూత్ గైడ్ కోసం ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేశారు ,
మా వెనుకనే మా తోనే ,బొంబాయి ట్రూప్ లో ఉన్నవాడే రిసీవ్ చేసుకున్నాడు ,అతనే మా కు గైడ్ అంటే మాతో పాటే మొదటి సారి ఇటలీ ,మిలాన్ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన మా సహ యాత్రికుడే మా యూరోప్ టూర్ గైడ్ !
నేను మన వేణుగోపాల రావు గారితో చెప్పాను
"మనది అడ్వెంచర్ టూరిజం " కాబోతోందని .. .. ఆయనేమీ పలకలేదు
మా గైడ్ కి హిందీ వస్తుందని చెప్పారు ... అతనికి "హిందీ"నే... , వస్తుందని వెనువెంటనే తెలిసింది
ఆ తర్వాత మా యాత్రా స్పెషల్ డ్రైవర్ ప్రత్యక్షం ,అతను ఇటాలియన్ ,రోమ్ లో ఉంటాడు
మన ఇండియన్ ఇంగ్లీష్ అర్ధం కాదు సుళువుగా
మనము ఏమి చెప్పినా తల, అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లుగా .... ఆలోచనలో ఉన్నట్లు కళ్ళు చిట్లించి ,ఒక టో ,రెండో నిముషాలకి ,... I don't get you ..చిరునవ్వు విసురుతాడు ...
మనం మరో మారు స్పష్టంగా పలకాలి పలుకులు .

![]() |
| మొత్తానికి అన్ని సామానుల సహితంగా ,మిలాన్ లో డ్రైవర్ ప్రత్యక్షం కావాలని .. |
![]() |
| చీకటి పడుతోంది ,రాడేలా ! చోదకుడు ! |
మా వెనుకనే మా తోనే ,బొంబాయి ట్రూప్ లో ఉన్నవాడే రిసీవ్ చేసుకున్నాడు ,అతనే మా కు గైడ్ అంటే మాతో పాటే మొదటి సారి ఇటలీ ,మిలాన్ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన మా సహ యాత్రికుడే మా యూరోప్ టూర్ గైడ్ !
నేను మన వేణుగోపాల రావు గారితో చెప్పాను
"మనది అడ్వెంచర్ టూరిజం " కాబోతోందని .. .. ఆయనేమీ పలకలేదు
మా గైడ్ కి హిందీ వస్తుందని చెప్పారు ... అతనికి "హిందీ"నే... , వస్తుందని వెనువెంటనే తెలిసింది
ఆ తర్వాత మా యాత్రా స్పెషల్ డ్రైవర్ ప్రత్యక్షం ,అతను ఇటాలియన్ ,రోమ్ లో ఉంటాడు
మన ఇండియన్ ఇంగ్లీష్ అర్ధం కాదు సుళువుగా
మనము ఏమి చెప్పినా తల, అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లుగా .... ఆలోచనలో ఉన్నట్లు కళ్ళు చిట్లించి ,ఒక టో ,రెండో నిముషాలకి ,... I don't get you ..చిరునవ్వు విసురుతాడు ...
మనం మరో మారు స్పష్టంగా పలకాలి పలుకులు .
![]() |
| ఆ పసుపు రంగు షర్ట్ లో ఉన్నదే చోదకుడు . |

Comments
Post a Comment