ముందు మాట

హైదరాబాద్  విమానాశ్రయంలో దోశ హబ్ 

తుమకూరు లో ప్రస్తుతం,మేము(నేనూ,మా ఆవిడా ) మా చిన్నబ్బాయి తో, కోడలి తో, మనవరాలి సంరక్షణలో నిమగ్నమై ఉన్నాము . ఇటీవలే యూరోపు ప్రయాణం చేసి వచ్చాక అక్కడి అనుభూతులన్నింటిని పంచుకుందామనుకుంటున్నా.మా గోపీ  అడుగుతూనే ఉన్నాడు రాయమని ,నాకే "Moment Of Inertia "

మా యూరోప్ ప్రయాణానికి ప్రేరణ మా గోపీ, మా ఆవిడ తమ్ముడు .
ఊరికే ,మాట మాత్రంగా "యూరపు వెళ్లాలనుకుంటున్నాము ,మీరూ రావచ్చు కదా "అని వారడగడం ,ఆమ్మో రాలేమని మా వాళ్ళు చెప్పడం జరిగి పోయాక ,నేను " అవును సరదాగా వెళ్లి రావొచ్చు ,ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ?"  "తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది " , It is a cart if it moves  or else it is Timber " " ప్రయాణం చేయడానికి  ధనవంతుడు కానక్కరలేదు ముందుకు అడుగు వేయడమే ముఖ్యం ", అంటూ నేనెక్కడో చదివిన వాక్యాలు ఉపయోగించడం ,ఆ మాట  పట్టుకుని , వెళ్ళేదాకా తీసుకురావడం ,అక్కా చెల్లెళ్ళ వంతయింది .
ప్రయాణానికి సంసిద్ధత ప్రకటించడం ఒక ఎత్తు ,ఆపైన సన్నాహాలు మరొక ఎత్తు అయితే ,వీసా కోసం చేసే తిప్పలు ఇంకా పెద్ద ఎత్తు .
వారినీ,వీరినీ సంప్రదించి ,ఎదో మంచు పర్వతాల నెక్క పోతున్న వారి మాదిరి ,మూటా ముల్లె ,సమకూర్చుకుని తెల్ల వాలారు ఝామున లేచి ఉరకలు పరుగుల తో తయారయి విమానాఆశ్రయం కి చేరి ,అన్ని పరీక్షలూ (సెక్యూరిటీ ) పాసయి గేట్ వద్ద వాలాము .
యూరోప్ ప్రయాణం కదా ,అవే ధరల కి సరిపోయే విధంగా అట్టూ ,ఫిల్టర్ కాఫీ ఆరగించి ,గేట్ తెరిచేదాకా ఆగి ముందుకు తోసుకు తోసుకు పోయి విమానం సీటుకి కట్టుకు కూర్చున్నాము .
అలా ఆకాశానికి ఎగిరాము .


Comments

Popular posts from this blog

అన్విక, బోసినవ్వుల కలబోసి , కబన్ పార్క్ విహారం

చిక్ బల్లాపూర్ లో ఈ వారం

విమాన యాత్ర ,రెండు అంగల్లో ఒమాన్ మీదుగా మిలాన్