 |
| ఇదిగో! మా ఇటలీ గూటి ముఖచిత్రం |
ఇవ్వాళ మూడవ రోజు ,
నిన్న ద్వితీయ విఘ్నం కాలేదుగా ,ఇంక ధోకా లేదు ,కొనసాగుతుంది " బ్లాగు ", భారతీయ క్రికెట్ జట్టు సారధి ధోనీ ,ఉన్నంత వరకూ ,మన ఇన్నింగ్స్ కి భరోసా ఉన్నట్లు ...
(ఒక స్మైలీ ముద్రిద్దామంటే కుదరలేదు )
సరే కథలోకి ,
మా హిందీ మాత్రమే తెలిసిన అవధూత్ సహా,మేమందరం డ్రైవర్ ని ....వేయి కళ్ళతో ,దుర్భిణీ వేసినంత పనీ చేసి ఆఖరున , పట్టుకుని , ఆ రాత్రి బస చేసే "ఐబిస్ " హోటల్ చేరుకున్నాము .
ముందే వార్నింగ్ ఇచ్చినట్లుగా ,సామాను ఎవరిది వారే మోయాలి,లాగాలి ,భుజానికో, మెడకో
( గొంతుకు ఉరి వేసినట్లు కాకుండా ,జాగ్రత్తగా ) తగిలించుకు మనకి , నిర్దేశించబడిన గూటికి
( గూడు ) చేరాలి . ఇదేమంత సులభం కాదు . ఒక్కోసారి ఒకే గ్రూప్ లో వారికి తలా ఒక అంతస్తు లో నూ రావొచ్చు .
సరే మొత్తానికి అవధూత్ జీ ,ఎవరి తాళాలు వారికిచ్చిన వెంటనే ,సామానూ మనుషులూ దొర్లుకుంటూ(దొర్లించుకుంటూ? నా ) గూడుకి చేరాము .. సుమారు 20 గంటలు తరువాత , వివిధ వాహనాల సాయంతో ,
ఇటలీ లో చక్కటి వెచ్చటి గూడు కి చేరాము.
మా BONTON HOLIDAYS వారు మంచి హోటలే సమకూర్చారు!
 |
Lounge లో ,మా వాళ్లు ,ఆ వెనకాల పానెల్ లో నిజమైన పచ్చిక .. అంటారు వారు (నాకు కాదని తెలుసు )
సరే ,మా అవధూత్ గారు చెప్పినట్లు బుద్ధిమంతుల్లా ఉదయం పెందలకడనే లేచి ,ముఖ ప్రక్షాళన చేసి ,తరువాత
హోటల్ వారు సమకూర్చిన వేడినీటి వసతి వాడుకుని స్నానమాచరించి ... పారిపోకండి ,స్టైల్ మారుస్తా
తయారయి , హోటల్ వారిచ్చే కాంప్లిమెంటరీ బ్రేక్ -ఫాస్ట్ పూర్తిగా న్యాయం చేయడానికి ప్రయత్నించి (సిగ్గులేకుండా )
మన భారతీయుల పరువు మనొక్కరి చేతుల్లోనే ఉందేవిఁటి ? అన్నట్లు తిని ,
అసలు కథ ఇప్పుడే మొదలు ,ఇంతవరకూ చూసిందీ ,మీకు చెప్పిందీ మా యూరోప్ టూర్ "టైటిల్సే "..
ఇప్పుడు గైడెడ్ టూర్ మొదలు ,దేవానంద్ కంటే రెండాకులు ఎక్కువ ఊగిసలాడే రోమన్ కాథలిక్ గైడ్ మా గైడ్ .
మొదటగా మమ్మల్ని సుమారుగా 1900 సంవత్సరాల క్రితం కట్టబడిన amphitheatre, Colosseum కి తీసుకెళ్లాడు . ప్రపంచంలో ఇప్పటికీ అతిపెద్దది . రాతితో నిర్మాణం చేయబడిన కోడిగుడ్డు ఆకారం లో ఉన్న అతి పురాతన కట్టడము
ఈ , COLOSSEUM జ్ఞాపకాలు సంతోష కరమయిన సంఘటనలతో కూడుకున్నది కాదు
ఇందులో క్రూర జంతువులతో బానిసలని ప్రాణం కొరకు పోరాటం చేయమని ఉసి కొల్పి ,అదొక క్రీడ లాగా చూసి ఆనందించే వారు ఆనాటి రాజవంశీయులు .
సుమారు నాలుగు వందల సంవత్సరాలు ఈ విధంగా ఉపయోగించబడింది
ఆ తర్వాత చారిత్రిక పరిణామాల రీత్యా పద్దెనిమిదవ శతాబ్దం వరకూ నిరాదరణకు గురై నది . 1800 నుండి ఒక ముఖ్యమయిన పురాతన చారిత్రిక కట్టడంగా నేటి వరకూ రోమ్ లో లక్షలాది యాత్రికుల దర్శనా స్థలమయింది .
ఈ కట్టడానికి పక్కనే ,మన BENHUR సినిమాలో Chariot రేస్ మొదలగు గుర్రపు పందాల మైదానం మొదలగునవన్నీ ఉన్నాయి . ఇవ్వన్నీ మా దేవానంద్ గైడ్ ,ఊగుతూ తూగుతూ వివరిస్తూంటే మాలో కొందరికి మైకం వచ్చి గభాలున పక్కన వాళ్ళని పట్టుకుని నిలతొక్కుకున్నారు!
|
 |
మా దేవానంద్ గైడ్ ,Colosseum వెనక గా కనిపిస్తున్నది
|
 |
అక్కడే పక్కన ఒక Museum
|
 |
అక్కడి సుందరమయిన వీధులు,భవనాలు
|
Babayyagaru u r too good with it good Telugu writing.... Keep going..I loved reading it blog..
ReplyDeleteఆద్యంతం అద్భుతం బాబాయ్ గారు ,
ReplyDeleteబాష, భావ ప్రకటనల్లో కొత్త కోణం !!
గైడ్ ' హావభావాలు దేవానంద్' తో పోల్చడం బావుంది 😊
మీ ఐరోపా యాత్రా విశేషాలు కళ్ళకు కట్టినట్టున్నాయి
' ఇది నా మాట ' మరో సంచిక కోసం ఎదురు చూస్తూ...
- నాని