రోమా ( రోమ్ ని ఇలానే అంటారు ఇటాలియన్లు ) లో మొదటి రోజు విహారం - Part 1

ఇదిగో! మా ఇటలీ  గూటి ముఖచిత్రం 
ఇవ్వాళ మూడవ రోజు ,
నిన్న ద్వితీయ విఘ్నం కాలేదుగా ,ఇంక ధోకా లేదు ,కొనసాగుతుంది " బ్లాగు ", భారతీయ క్రికెట్ జట్టు సారధి ధోనీ ,ఉన్నంత వరకూ ,మన ఇన్నింగ్స్ కి భరోసా ఉన్నట్లు ... 
(ఒక స్మైలీ ముద్రిద్దామంటే కుదరలేదు )
సరే కథలోకి ,
మా హిందీ మాత్రమే తెలిసిన అవధూత్ సహా,మేమందరం  డ్రైవర్ ని ....వేయి కళ్ళతో ,దుర్భిణీ వేసినంత పనీ చేసి ఆఖరున , పట్టుకుని , ఆ రాత్రి బస చేసే "ఐబిస్ " హోటల్ చేరుకున్నాము .
ముందే వార్నింగ్ ఇచ్చినట్లుగా ,సామాను ఎవరిది వారే మోయాలి,లాగాలి ,భుజానికో, మెడకో 
( గొంతుకు ఉరి వేసినట్లు కాకుండా ,జాగ్రత్తగా ) తగిలించుకు మనకి , నిర్దేశించబడిన గూటికి
( గూడు ) చేరాలి .  ఇదేమంత సులభం కాదు . ఒక్కోసారి ఒకే గ్రూప్ లో వారికి తలా ఒక అంతస్తు లో  నూ రావొచ్చు . 
సరే మొత్తానికి  అవధూత్ జీ ,ఎవరి తాళాలు వారికిచ్చిన వెంటనే ,సామానూ మనుషులూ దొర్లుకుంటూ(దొర్లించుకుంటూ? నా )  గూడుకి చేరాము .. సుమారు 20 గంటలు తరువాత , వివిధ వాహనాల సాయంతో , 
ఇటలీ లో చక్కటి వెచ్చటి గూడు కి చేరాము. 

మా BONTON HOLIDAYS వారు మంచి హోటలే సమకూర్చారు!
Lounge లో ,మా వాళ్లు ,ఆ వెనకాల పానెల్ లో నిజమైన పచ్చిక .. అంటారు  వారు (నాకు కాదని తెలుసు )


సరే ,మా అవధూత్ గారు చెప్పినట్లు బుద్ధిమంతుల్లా ఉదయం పెందలకడనే లేచి ,ముఖ ప్రక్షాళన చేసి ,తరువాత
హోటల్ వారు సమకూర్చిన వేడినీటి వసతి వాడుకుని స్నానమాచరించి ... పారిపోకండి ,స్టైల్ మారుస్తా
తయారయి , హోటల్ వారిచ్చే కాంప్లిమెంటరీ బ్రేక్ -ఫాస్ట్ పూర్తిగా న్యాయం చేయడానికి ప్రయత్నించి (సిగ్గులేకుండా )
మన భారతీయుల పరువు మనొక్కరి చేతుల్లోనే ఉందేవిఁటి ? అన్నట్లు  తిని ,
అసలు కథ ఇప్పుడే మొదలు ,ఇంతవరకూ చూసిందీ ,మీకు చెప్పిందీ మా యూరోప్ టూర్ "టైటిల్సే "..
ఇప్పుడు  గైడెడ్ టూర్ మొదలు ,దేవానంద్ కంటే రెండాకులు ఎక్కువ ఊగిసలాడే రోమన్ కాథలిక్ గైడ్ మా గైడ్ .
మొదటగా మమ్మల్ని సుమారుగా 1900 సంవత్సరాల క్రితం కట్టబడిన amphitheatre, Colosseum కి తీసుకెళ్లాడు . ప్రపంచంలో ఇప్పటికీ అతిపెద్దది . రాతితో నిర్మాణం చేయబడిన కోడిగుడ్డు ఆకారం లో ఉన్న అతి పురాతన కట్టడము
ఈ , COLOSSEUM  జ్ఞాపకాలు సంతోష కరమయిన సంఘటనలతో కూడుకున్నది కాదు
ఇందులో క్రూర జంతువులతో బానిసలని ప్రాణం కొరకు పోరాటం చేయమని ఉసి కొల్పి ,అదొక క్రీడ లాగా చూసి ఆనందించే వారు ఆనాటి రాజవంశీయులు .
సుమారు నాలుగు వందల సంవత్సరాలు ఈ విధంగా ఉపయోగించబడింది



ఆ తర్వాత చారిత్రిక పరిణామాల రీత్యా పద్దెనిమిదవ శతాబ్దం వరకూ నిరాదరణకు గురై నది . 1800 నుండి ఒక ముఖ్యమయిన పురాతన చారిత్రిక కట్టడంగా నేటి వరకూ రోమ్ లో లక్షలాది యాత్రికుల దర్శనా స్థలమయింది .
ఈ కట్టడానికి పక్కనే ,మన BENHUR  సినిమాలో Chariot రేస్ మొదలగు గుర్రపు  పందాల మైదానం మొదలగునవన్నీ ఉన్నాయి . ఇవ్వన్నీ మా దేవానంద్ గైడ్ ,ఊగుతూ తూగుతూ వివరిస్తూంటే మాలో కొందరికి మైకం వచ్చి గభాలున పక్కన వాళ్ళని పట్టుకుని నిలతొక్కుకున్నారు!

మా దేవానంద్ గైడ్ ,Colosseum వెనక గా కనిపిస్తున్నది

అక్కడే పక్కన ఒక Museum



అక్కడి సుందరమయిన వీధులు,భవనాలు



  

Comments

  1. Babayyagaru u r too good with it good Telugu writing.... Keep going..I loved reading it blog..

    ReplyDelete
  2. ఆద్యంతం అద్భుతం బాబాయ్ గారు ,
    బాష, భావ ప్రకటనల్లో కొత్త కోణం !!
    గైడ్ ' హావభావాలు దేవానంద్' తో పోల్చడం బావుంది 😊
    మీ ఐరోపా యాత్రా విశేషాలు కళ్ళకు కట్టినట్టున్నాయి
    ' ఇది నా మాట ' మరో సంచిక కోసం ఎదురు చూస్తూ...
    - నాని

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అన్విక, బోసినవ్వుల కలబోసి , కబన్ పార్క్ విహారం

చిక్ బల్లాపూర్ లో ఈ వారం

విమాన యాత్ర ,రెండు అంగల్లో ఒమాన్ మీదుగా మిలాన్